కథలాపూర్
పోసానిపేట ప్రాథమికోన్నత పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు

viswatelangana.com
October 1st, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని పోసానిపేట ప్రాథమికోన్నత పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకల్లో భాగంగా ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు పాఠశాలలో ఘనంగా నిర్వహించడం జరిగింది. విద్యార్థిని, విద్యార్థులు వివిధ రకాల పూలను సేకరించి బతుకమ్మలను తయారు చేసి బతుకమ్మ ఆటలు ఆడారు. విద్యార్థినిలతో పాటు అధ్యాపకులు అందరూ కలిసి ఆటలాడారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గుండేటి రవికుమార్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



