రాయికల్
జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన సందర్బంగా ప్రభుత్వ హాస్పిటల్ లో పండ్లు , బ్రేడ్ ప్యాకెట్స్ పంపిణీ

viswatelangana.com
March 13th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
భారత జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క జన్మదిన సందర్బంగా రాయికల్ మున్సిపల్ కౌన్సిలర్ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో రాయికల్ మండల కేంద్రంలో కేక్ కట్ చేసి స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ లో రోగులకు మరియు గర్భిణిలకు పండ్లు , బ్రేడ్ ప్యాకెట్స్ పంపిణీ చేయడం జరిగింది . ఈ సందర్బంగా తురగ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ కల్వకుంట్ల కవిత ఆయురారోగ్యాలతో జీవించాలని ప్రజలకు సేవలు చేస్తూ ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.. ఈ కార్యక్రమంలో రాయికల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ ఛైర్మన్ బర్కం మల్లేష్, సుతారి తిరుపతి, సాయి కిరణ్ వెంకటేష్ , సూర్యం, అమిత్, తేజ, వంశీ, రవితేజ, రాజేష్, రాంప్రసాద్ , నవీన్ మరియు యూత్ నాయకులు పాల్గొన్నారు..



