బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధనలో నేటి యువత నడవాలి టిడిపి పట్టణ అధ్యక్షులు మానుక ప్రవీణ్

viswatelangana.com
మాజీ ప్రధాని శ్రీ బాబు జగ్జీవన్ రామ్ 117 వ జయంతి కార్యక్రమం సందర్భంగా కోరుట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మానుక ప్రవీణ్ కుమార్ పూలదండ వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడిన మహానీయుడు, భారత స్వతంత్ర సమరయోధుడు, దళితుల హక్కు కోసం నిరంతరం కృషి చేసిన నేత అని కోరుట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మానుక ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. భారత రాజకీయ రంగంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమైనవని తన జీవితమంతా సమాజసేవ స్థాపన కోసమే కృషి చేసిన వ్యక్తి అని అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ తన పరిపాలన దక్షతలో అఖండ భారత వానికి విశేష సేవలు అందించిన జగ్జీవన్ రావ్ అని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేశం నాయకులు కొక్కుల మహదేవ్, ఎండి రఫీ దిన్, సుల్తాన్, బాలే మారుతి, ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు.



