ట్విన్నింగ్ అఫ్ స్కూల్ లో భాగంగా ప్రభుత్వ పాఠశాల లను తనిఖీ చేసిన ఎంఈఓ

viswatelangana.com
జగిత్యాల జిల్లా విద్యాధికారి జగిత్యాల ఆదేశాల ప్రకారం కోరుట్ల మండలంలోని ప్రాథమికొన్నత పాఠశాలలు ట్విన్నింగ్ అఫ్ స్కూల్స్ లో భాగంగా మండలంలోని వివిధ కాంప్లెక్స్ పాఠశాలలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికలు కోరుట్ల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మోహనరావుపేట, ప్రభుత్వ ఉన్నత పాఠశాల కోరుట్ల లను ఎంఈఓ సందర్శించారు. ఈ సందర్శనలో విద్యార్థుల మధ్య పరస్పర అవగాహనా, సోదర భావం మరియు ఉన్నత పాఠశాలలో వనరులు, ఐఎఫ్ ఈ ప్యానెల్స్, ల్యాబ్, డిజిటల్ లైబ్రరీ మొదలగు వాటిని చూసి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం లో మండల విద్యాధికారి గంగుల నరేశం, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు బి. ఆనందరావు,నల్ల భూమయ్య, ఇంచార్జి ప్రధానోపాధ్యాయురాలు బి. సుమలత, యుపి ఎస్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు నాగుల నరహరి, ఫార్జానాబేగం, పోగుల అంజయ్య, ఉదయరూప, వాజీద్, అజం లు మరియు సిఆర్ పి లు పి. గంగాధర్, ఎ.దేవేందర్, ఎ.జ్యోతి, ఐ.మన్విత లు పాల్గొన్నారు.



