చక్కెర ఫ్యాక్టరీ గురించి మాట్లాడే అర్హత కోరుట్ల ఎమ్మెల్యేకు లేదు
పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్

viswatelangana.com
కోరుట్ల నియోజకవర్గంలో గల ఏకైక రైతు ఆధారిత పరిశ్రమ అయిటువంటి ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్ అన్నారు. గురువారం కోరుట్ల నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ షుగర్ ఫ్యాక్టరీ గురించి అసెంబ్లీలో ప్రస్తావించడం విడురంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని, అట్టి కమిటీ షుగర్ ఫ్యాక్టరీని సందర్శించిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. కాంగ్రెస్ పార్టీ షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం ఇప్పటివరకు 180 కోట్ల బ్యాంకు బకాయిలను కూడా చెల్లించడం జరిగిందని, త్వరలోనే షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణను కమిటీ ఆధ్వర్యంలో ఫ్యాక్టరీ పున: ప్రారంభం చేపట్టబోతున్నామని, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ దయ్యాలు వేదాలు వల్లించినట్లు ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ విషయమై అసెంబ్లీలో ప్రస్తావించడం విడ్డూరంగా ఉందన్నారు. గత ప్రభుత్వం షుగర్ ఫ్యాక్టరీ కోసం చేసిన అప్పు బకాయిలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెల్లించడం జరిగిందన్న విషయాన్ని గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో నడుస్తున్న ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని మూసి వేయించిన ఘనత కల్వకుంట్ల కుటుంబానికే దక్కుతుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే 100 రోజుల్లోగా ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని పున: ప్రారంభింప జేస్తానని లేకుంటే ఆ గేటుకే ఉరి వేసుకుంటానని మాట ఇచ్చి తప్పడం జరిగిందన్నారు. కేవలం కల్వకుంట్ల కుటుంబం రాజకీయ లబ్ధి కోసమే ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ ప్రస్తావన తీసుకొస్తున్నారే తప్ప వారు చేసింది ఏమీ లేదన్నారు. ఇప్పటికైనా రైతులను ప్రజలను పక్కదో పట్టించడం మానుకోవాలన్నారు. అంతేకానీ లేనిపోని అపోహాలను ప్రజల్లో, రైతుల్లో సృష్టించి సమస్యను పక్కదోవ పట్టించకుండా అభివృద్ధి సంక్షేమం కోసం కృషి చేయాలని పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్ హితవు పలికారు.



