కోరుట్ల

ఘనంగా బద్ది పోచమ్మ బోనాలు

viswatelangana.com

March 2nd, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

కోరుట్ల మండలం యూసఫ్ నగర్ గ్రామంలో ప్రతి సంవత్సరం శివరాత్రి అనంతరం నిర్వహించే బద్ది పోచమ్మ బోనాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గంగపుత్రులు గొళ్ళెంలు అలాగే డప్పు చప్పులతో పోతరాజుల విన్యాసాలతో అంగరంగ వైభవంగా మహిళలు ఊరేగింపుగా పెద్ద ఎత్తున బోనాలు తీసుకెళ్లి బద్ది పోచమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మహిళలు గ్రామ ప్రజాప్రతినిధులు బద్దిపోచమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ డైరెక్టర్ గుగ్గిళ్ళ సురేష్ గౌడ్, వీడీసీ చైర్మన్ వెల్లుల్ల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ తుకారం, కాంగ్రెస్ బిసి సెల్ అధ్యక్షులు ముక్కెర లింబాద్రి, గ్రామ అభివృద్ధి కమిటీ నాయకులు, యువజన సంఘాల నాయకులు అలాగే మహిళలు పాల్గొన్నారు.

Related Articles

Back to top button