రాయికల్
బంగారం,వెండి తో సూక్ష్మ వరల్డ్ కప్

viswatelangana.com
March 12th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని సింగ రావుపేట్ గ్రామానికి చెందిన స్వర్ణకారుడు ఇల్లెందుల నాగేందర్ 10 మిల్లి గ్రాముల బంగారము 300 మిల్లి గ్రాముల వెండి లతో అతి చిన్న వరల్డ్ కప్ తయారుచేశారు. ప్రత్యేక సందర్భాలలో నాగేందర్ సూక్ష్మ వస్తువులు తయారు చేస్తుండగా ఇప్పటివరకు అనేక సూక్ష్మ వస్తువులను తయారు చేశారు. వరల్డ్ కప్ సందర్భంగా అతి తక్కువ ఖర్చుతో తయారుచేసిన వరల్డ్ కప్ పలువురుని ఆకట్టుకుంది.



