జగిత్యాల

ఎండ తీవ్రతతో ఆకస్మాత్తుగా  చెలరేగిన మంటలు

viswatelangana.com

April 30th, 2024
జగిత్యాల (విశ్వతెలంగాణ) :
  • ఫైర్ అండ్ సేఫ్టీ నియమాలు పాటించని భవనాలు
  • సర్వత్ర విమర్శలు ఎదుర్కొంటున్న అధికారులు

స్థానిక జగిత్యాల పట్టణంలో కొత్త బస్టాండ్ కు కూతవేటు దూరంలో గల ఓ ప్రైవేటు ఉమెన్స్ హాస్టల్ నిర్వహిస్తున్నటువంటి మూడంతస్తుల భవనంలో వేసవికాలం ఎండ వేడిమి కి తాళలేక భవన కింది భాగంలో గల త్రీ ఫేస్ కరెంటు మీటర్ కు అనుసంధానంలో ఉన్న కొన్ని సెల్ టవర్లకు కరెంటు సప్లై అయ్యే సందర్భంలో లోడ్ తట్టుకోలేక పైగా ఎండవేడిమికి హఠాత్తుగా మీటర్ కాలి మంటలు చెలరేగడంతో చుట్టుపక్కన ఉన్న దుకాణదారులు ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఆ సందర్భంలో అక్కడే ఉన్న విశ్వ తెలంగాణ విలేఖరి వెంటనే స్పందించి ఫైర్ స్టేషన్ కు చరవాని లో సంప్రదించడం తో హుటాహుటిన చేరుకున్న ఫైర్ స్టేషన్ సిబ్బంది కార్బన్ డై ఆక్సైడ్ సిలిండర్లతో మంటలు ఆర్పేయడంతో ప్రమాదం సద్దుమణిగింది. ఇది ఇలా ఉంటే మూడంతస్తుల భవనానికి ఫైర్ సేఫ్టీ లేకపోవడం అధికారుల పనితీరుపై అనుమానానికి తావిస్తోంది. ఫైర్ సేఫ్టీ చట్టాన్ని అనుసరించి నిర్ణీత ఎత్తులో ఉన్న భవనాలకు కచ్చితంగా ఫైర్ సేఫ్టీ సిలిండర్లను అమర్చాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రమాదం సంబవించినప్పుడు వెనువెంటనే ప్రమాదాన్ని నివారించడానికి అవకాశం ఉంటుంది. కానీ సంబంధిత అధికారులు అమ్యమ్యాలకు అలవాటు పడి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆ నోట ఈ నోట అనుకుంటున్నారు. బిల్డింగ్ నిర్మాణ సమయంలో తనిఖీలు చేయవలసిన బిల్డింగ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు చేయడం లేదని ప్రజలు తలలు బాదుకుంటున్నారు. ఎవరి కర్తవ్యం వారు సరిగా నిర్వహిస్తే పెను ప్రమాదాల ముప్పుతప్పుతుందని ఇకనైనా సంబంధిత అధికారులు, జిల్లా కలెక్టర్ స్పందించి సంబంధిత శాఖ అధికారులపై చర్యలు తీసుకొని ప్రజలకు న్యాయం చేయాలని పుర ప్రముఖులు కోరుతున్నారు.

Related Articles

Back to top button