రాయికల్
మిల్లు కార్మికుల సమావేశం

viswatelangana.com
March 3rd, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని మార్కండేయ పంక్షన్ హాల్ లో హెచ్ డి ఎఫ్ సంస్ద ఆధ్వర్యంలో సోమవారం మిల్లు కార్మికులతో సమావేశం నిర్వహించారు. సంస్ద అధ్యక్షులు హేమంత్ గోసావి మాట్లాడుతూ బొంబాయి మిల్లుల్లో పనిచేసిన కార్మికులకు ఇండ్లు ఇప్పించేందుకు సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు లక్ష్మీకాంతం పాటిల్, సభ్యులు గణపతి బోస్లే, ఉత్తమ్ సిందే, రవిందర్ సిందే, దత్తురామ్ సరాఠే, తెలంగాణ సభ్యులు గాజెంగి రమేష్, మిట్టపల్లి రాంచంద్రం, గాజంగి పోశెట్టి, గాజంగి రవి, సిరిపురం భూమయ్య, శ్రీధర్, మిల్లు కార్మికులు తదితరులు పాల్గొన్నారు.



