కోరుట్ల

రైజింగ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో మాస్టర్ తైక్వాండో క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ యోగ దినోత్సవ వేడుకలు

viswatelangana.com

June 21st, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

ప్రపంచ యోగ దినోత్సవం సందర్భంగా శుక్రవారం రోజున కోరుట్ల పట్టణంలోని రైజింగ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో మాస్టర్ తైక్వాండో క్లబ్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు యోగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాస్టర్ తైక్వాండో క్లబ్ వ్యవస్థాపకులు, కోచ్ నావనంది రమేష్ పాఠశాల విద్యార్థులకు యోగాలోని మెలకువలను, ఆసనాలను విద్యార్థిని విద్యార్థులకు నేర్పించి, యోగ వల్ల కలిగే ఉపయోగాలను వారికి వివరించడం జరిగింది. ఈ సందర్భంగా రైజింగ్ హై స్కూల్ కరస్పాండెంట్ కుడేల రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఈ యోగ విద్యని తప్పకుండా ప్రతిరోజు తమ దైనందిత జీవితంలో అలవాటు చేసుకుని ఆరోగ్యంగా ఉండాలని, తప్పకుండా ప్రతిరోజు సాధన చేయాలని విద్యార్థులకు సూచించారు .ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులకు ప్రపంచ యోగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైజింగ్ స్కూల్ ప్రిన్సిపాల్ కుడేల లిఖిత, డైరెక్టర్స్ సిహెచ్ మోహన్, షానాజ్ బేగం, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థు లు పాల్గొన్నారు.

Related Articles

Back to top button