రైతు ఉత్పత్తి దారుల ఆఫీస్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

viswatelangana.com
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామంలో రైతు ఉత్పత్తి దారుల కంపెనీ లిమిటెడ్ ఆఫీస్ ను జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు ప్రతి ఒక్కరూ సేంద్రియ వ్యవసాయానికి అలవాటు పడాలని ప్రతి రైతు కూరగాయలు మార్కెట్ కి వెళ్లి కొనుక్కోకుండా రైతులు స్వయంగా పండించుకోవాలని సూచించారు సంఘంలోని డైరెక్టర్లు మంచి పంటలు పండించి ఇతర రైతులకు ఆదర్శంగా నిలవాలని సూచించారు రైతు ఉత్పత్తి దారుల సంఘాన్ని అభివృద్ధి బాటలో నిలపాలని సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వాణి, నాబార్డ్ ఏ జి మ్ మనోహర్ రెడ్డి, లీడ్ బ్యాంకు మేనేజర్ వెంకట్ రెడ్డి రాయికల్ మండల తహసిల్దార్ అబ్దుల్ ఖయ్యూం, రెవెన్యూ ఇన్స్పెక్టర్ పద్మయ్య, పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం దత్తత అల్లీపూర్ దత్తత గ్రామ ఇంచార్జ్ డాక్టర్ డి ఏ రజినీ దేవి, , అల్లీపూర్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ జయంతి, రైతు ఉత్పత్తి దారుల సంఘం అధ్యక్షుడు అత్తినేని శంకర్, డైరెక్టర్లు,అత్తినేని రాజన్న, కొండపలుకుల రత్నాకర్, ఒరగంటి రాజలింగం, మెక్కొండ రాంరెడ్డి,రాజారెడ్డి, సాయి, వెంకటేష్ రాజశేఖర్, ఎంపీటీసీ విజయలక్ష్మి వెంకటేష్ , అల్లీపూర్ చుట్టుపక్కల గ్రామాల రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు



