కోరుట్ల

వెంకటాపూర్ లో వైభవంగా గోదాదేవి కల్యాణ ఉత్సవాలు

viswatelangana.com

January 11th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

కోరుట్ల మండలం వెంకటాపూర్ గ్రామంలో గల “శ్రీ వెంకటేశ్వర స్వామీ” గుట్ట ఆలయ కమిటీ ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా “శ్రీ గోదాదేవి కళ్యాణం” వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ బోయినపల్లి సత్యనారాయణ రావు దంపతుల చేతులమీదుగా కుటుంబ సమేతంగా గ్రామస్తుల, వేదపండితుల, గ్రామ ప్రతినిధుల సమక్షంలో అంగరంగం వైభవంగా నిర్వహించారు. ఇట్టి ఉత్సవాలలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు కుటుంబ సమేతంగా పాల్గొని ప్రత్యేకపూజలు నిర్వహించారు. జువ్వాడి కృష్ణారావు వెంట ఆలయ కమిటీ అధ్యక్షులు రాజేష్, కౌన్సిలర్ ఎంబేరి నాగభూషణం, పుప్పాల ప్రభాకర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పెరుమాళ్ళ సత్యనారాయణ, కిసాన్ సెల్ బీసీ సెల్ మండల అధ్యక్షులు నర్సయ్య, లింబాద్రి రవీందర్ రెడ్డి, చిట్టి బాబు, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button