రాయికల్
ఆర్థిక చేయూత

viswatelangana.com
April 8th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం రామాజీపేట గ్రామానికి చెందిన పల్లికొండ లక్ష్మీనారాయణ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. మృతిని కుటుంబం పేదరికంలో ఉండడంతో ప్రవాస భారతీయులు దుబాయ్ లో వారధి సంఘం మృతుని కుటుంబానికి అండగా నిలిచేందుకు 48,350 రూపాయలు అందించారు. ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లిన రామాజీపేట యువకులు 56 మంది కలిసి దుబాయ్ వారధి సంఘం ను ఏర్పాటు చేశారు. కాగా వీరు గ్రామంలో వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలు ఆర్థిక చేయుతనందిస్తూ ఉంటారు. ఈ సందర్భంగా దుబాయ్ వారధి సంఘం సభ్యులను గ్రామస్తులు అభినందించారు.



