రాయికల్

అంగన్వాడి కేంద్రంలో బడిబాట ముగింపు

viswatelangana.com

June 19th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో నాలుగవ అంగన్వాడి కేంద్రం నందు అంగన్వాడీ బడిబాట ముగింపు కార్యక్రమంలో భాగంగా ఈరోజు సామూహిక శ్రీమంతాలు అక్షరాభ్యాసాలు అన్నప్రాసనలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి వచ్చిన గర్భవతులకు బాలింతలకు 0-5 సంవత్సరాల పిల్లల తల్లులకు పోషకాహారం గురించి ఆరోగ్యం గురించి అంగన్వాడి సెంటర్లో నిర్వహించే ప్రీ స్కూల్ కార్యక్రమాల గురించి తల్లులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో గర్భిణి బాలింతలు 0-5 సంవత్సరాల పిల్లల తల్లులు అంగన్వాడీ టీచర్స్ పార్వతి బుజ్జమ్మ సువర్ణ సుజాత అనురాధ ఏఎన్ఎం రజిత ఆశా వర్కర్ వనిత అంగన్వాడి ఆయాలు రమ్య లావణ్య మహిళలు తదితరులు పాల్గొన్నారు

Related Articles

Back to top button