రాయికల్
అంగన్వాడీ కేంద్రంలో పోషణ్ పక్వాడ్

viswatelangana.com
April 15th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం దావన్ పల్లి గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో సిడిపిఓ మమత ఆధ్వర్యంలో మంగళవారం రోజున పోషన్ పక్వాడ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బానోత్ జనని, మోక్ష శ్రీ అనే ఒక అతి తీవ్ర లోప పోషణతో గురి అవుతున్న పాప యొక్క బరువు, ఎత్తు కొలవడం జరిగింది. ఆ తర్వాత ఆ తల్లిని పాప బరువు తక్కువ ఉండడానికి కారణం తెలుసుకొని అలాంటివి మళ్లీ జరగకుండా చూడాలని సిడిపిఓ మమత తల్లులకు తగు సూచనలు ఇచ్చారు. స్థానికంగా లభించే ఆకు కూరలు, కూరగాయలు, సీజన్ పండ్లు, చిరు దాన్యాలు, తృణ దాన్యాలు మొలకలు తినాలని తెలిపారు.ఈ కార్యక్రమంలొ సూపర్వైసర్ సువర్ణ, పంచాయతీ సెక్రెటరీ గీతారాణి, అంగన్వాడీ టీచర్ రోజా, గర్భిణీ, బాలింతలు తల్లులు, ఇతరులు పాల్గొన్నారు.



