భీమారం

అంగరంగ వైభవంగా భీమేశ్వర స్వామి కళ్యాణం

viswatelangana.com

March 11th, 2024
భీమారం (విశ్వతెలంగాణ) :

భీమవరం మండల కేంద్రంలోని పురాతన దేవాలయం శ్రీ భీమేశ్వర స్వామి వారి కళ్యాణ జాతర శివరాత్రి తరువాత ఏటా రెండో రోజు జరిగే కళ్యాణం కన్నుల పండుగగా భీమవరం మండల కేంద్రంలో జాతర కళ్యాణం మహోత్సవాన్ని నిర్వహికులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి వేములవాడ ఎమ్మెల్యే విప్ ఆది శ్రీనివాస్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఏటా శ్రీ భీమేశ్వర స్వామి ఉత్సవాన్ని జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు దర్శించుకున్నారు. ఎమ్మెల్యే గా భీమేశ్వర స్వామివారిని దర్శించుకోవడం జీవితంలో మర్చిపోలేని అనుభూతి అని ఆది శ్రీనివాస్ చెప్పారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి భీమారం మేడిపల్లి మండల ప్రజలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని జాతర మహోత్సవాన్ని విజయవంతం చేశారు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు, వచ్చిన భక్తులకు ఎండ తాకిటికి మజ్జిగ చల్ల అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కేంద్రంలోని ప్రజలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Related Articles

Back to top button