అంగరంగ వైభవంగా రాజరాజేశ్వర నాగాలయ రథోత్సవం

viswatelangana.com
జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని కొత్తపేట గ్రామంలో శ్రీ రాజ రాజేశ్వర నాగాలయంలో గత మూడు రోజులుగా జరుగుతున్న మహా శివరాత్రి వేడుకలు నేటితో ముగిశాయి రథం ముందు ఉత్సవ విగ్రహాలను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం బ్రాహ్మహోత్తముల వేదమంత్రాల ఉచ్చరణ సాక్షిగా ఢమరుకనాథలతో బైండ్లో ల వాయిద్యాలు నడుమ శివ సాత్తులు శివాలెత్తగా భక్తులు నిమయ నిష్ఠలతో రథాన్ని తాళ్లతో లాగగా ఆలయం చుట్టూ రథోత్సవ వేడుక కనుల పండగ జరిగింది వేలాదిమంది భక్తులు స్వామివారి రథం చుట్టూ చేరిఓం నమశ్శివాయ అనే నాదాలతో ఆలయ ప్రాంగణం దద్దరిల్లింది, పరమశివుడు పరవశించగా ఆలయం చుట్టూ తిరిగి గుడి ముందు రథాన్ని ఉంచి ఉత్సవ విగ్రహాలను సన్నాయి వాయిద్యాల మధ్య ఆలయంలోకి తీసుకెళ్ళు ప్రత్యేక పూజలు నిర్వహించారు కాగ ఉదయం నుండి అన్నదానం కార్యక్రమం నిర్వహించగ, ఓడ్డెర కాలనీ గ్రామపంచాయతీ నుండి అధిక సంఖ్యలో భక్తులు బద్ది పోచమ్మకు మొక్కలు తీర్చుకున్నారుఆలయం చుట్టూ అనేక బొమ్మల, తినుబండారాల దుకాణ సముదాయాలు జనంతో నిండాయి పోలీస్ శాఖ వారు సబ్ ఇన్స్పెక్టర్ అజయ్ ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించారువైద్యశాఖ వారు ముందస్తుగా భక్తుల అవసరాల రీత్యా అందుబాటులో ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈ వో విక్రమ్ గౌడ్, చైర్మన్ దానవెని రాము, మాద జల, బోదాసు రాజారెడ్డి, నర్సారెడ్డి, ఏనుగు నాగిరెడ్డి, ముక్కెర ముత్యం, బొంగొని భూమా గౌడ్ చెరుకు రాజేశ్వర శర్మ,లతో పాటు ఎంపిటిసి మందుల శ్రీనివాస్మాజీ తాజా సర్పంచ్ బత్తిని రాజేశం, జక్కుల చంద్ర శేఖర్, మండ రమేష్, బెక్కం తిరుపతి, నాయకులు మన్నేగుండ్లనర్సయ్య, ప్రవీణ్,తదితరులు పాల్గొన్నారు



