అంబారిపేట హై స్కూల్ నుండి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సబ్ జూనియర్ ఖో ఖోపోటీల్లో ఎంపికైన చింత శరణ్య

viswatelangana.com
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని అంబారిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని చింత శరణ్య ఎనిమిదవ తరగతి చదువుతుంది. తండ్రి రాజేష్ ప్రోత్సాహంతో అన్ని రంగాలలో ఉండాలని కూతురును తల్లిదండ్రులు ప్రోత్సహం ఉన్నప్పుడు మరింతగా అన్ని రకాలుగా ముందుకు సాగుతారని అన్నారు. అదేవిధంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కిషన్ రావు మాట్లాడుతూ, పిల్లలు చదువుతోపాటు ఆటలలో ఉల్లాసంగా ఉత్సాహంగా శారీరకంగా ఉన్నట్లు అయితే ప్రతి ఒక్క పిల్లలు వారి విజయాలను అందుకుంటారని, శరణ్య అనే అమ్మాయి రాష్ట్ర స్థాయి పోటీల కోసం సబ్ జూనియర్ ఖో ఖో టీమ్ నుండి రాష్ట్ర స్థాయి కి ఎంపికైన సందర్భంగా పాఠశాల సిబ్బంది తరపున వారికీ ప్రతేక అభినందనలు తెలియజేసారు. ఫిజికల్ డైరెక్టర్ జి.రాజేష్ మాట్లాడుతూ అమ్మాయిలకి గాని మరియు అబ్బాయిలకి గాని సమానంగా ఆటలు అనేవి ఉంటాయని శారీరకంగా ఉండి గ్రౌండ్ లో రోజు వ్యాయామాలు చేస్తూ ఆటలలో పాల్గొని చురుగ్గా ఉన్నట్లయితే ప్రతి ఒక్కరికి విజయాలు అనేవి తప్పవని అన్నారు ఫిజికల్ గా ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా చదువులో ఉంటారు ఆటల్లో ఉంటారని అన్నారు. అదే విధంగా చింత శరణ్యకు ప్రతేక ధన్యవాదములు తెలిపారు.



