కోరుట్ల

అట్ట హాసంగా గ్లోబల్ హై స్కూల్ ప్రారంభోత్సవం

viswatelangana.com

June 13th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

కోరుట్ల పట్టణంలోని అటుకుల గిర్నీ రహీమత్ పురలో నూతనంగా నెలకొల్పబడిన గ్లోబల్ హై స్కూల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా మజీద్ ఏ అయేషా మౌలానా ముస్తాక్ హాజరు అయి. గ్లోబల్ హై స్కూల్ వాతావరణం పిల్లల మానసిక, శారీరక ఎదుగుద లకు అనుగుణంగా ఆహ్లాదకరంగా ఉందని తెలిపారు. ప్రారంభించిన మొదటి సంవత్సరంలోనే కోరుట్ల పట్టణ పరిసర గ్రామలలోని తల్లిదండ్రుల అత్యధిక ఆధారణాభిమానాలు పొంది అధిక అడ్మిషన్లు సాదించినందుకు స్కూల్ ప్రిన్సిపాల్ మిర్జా మునవర్ ఆలీ బైగ్ వ్యక్తం చేస్తూ స్కూల్ తేదీ జూన్ 16 సోమవారం నుండి తరగతులు నిర్వహించడం జరుగుతుంది అని స్కూల్ ప్రిన్సిపాల్ మిర్జా మునవర్ ఆలీ బైగ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్లోబల్ హై స్కూల్ కరస్పాండెంట్ సయ్యద్ మిన్హాజ్, స్కూల్ ప్రిన్సిపాల్ మిర్జా మునవర్ ఆలీ బైగ్, మాజీ కౌన్సిలర్లు, ఆడెపు మధు, బాబా భాయ్, కోరుట్ల, ఎంఐఎం పట్టణ అధ్యక్షుడు ఎండి రఫీ, జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ ఉపాధ్యక్షులు ఎండి వసీం, కోరుట్ల వ్యాపారవేత్త అజరుద్దీన్, సమాజ్వాది పార్టీ రాష్ట్ర నాయకులు ఎండి ముజాహిద్, మహమ్మద్ అలీ మెమోరియల్ ట్రస్ట్ అధినేత మసూద్ అలీ, అడ్వకేట్ అమీర్, పాత్రికేయులు మిర్జా ముక్రం బైగ్, ఎండి సుజాత అలీ, ఎండి జమీల్, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button