అత్యంత వైభవంగా సీతారాముల కల్యాణ మహోత్సవం

viswatelangana.com
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణం ఆదర్శనగర్ లో గల శ్రీ అష్టలక్ష్మి సమేత శ్రీ ఆదిలక్ష్మి నారాయణస్వామి దేవాలయంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ సీతారాముల కళ్యాణం ఆలయ ప్రధాన అర్చకులు ఇందుర్తి మధుసూదనాచారి ఫణీంద్ర శర్మల వైదిక నిర్వహణలో అత్యంత వైభవంగా నిర్వహించారు అనంతరం ఆలయ నిర్వహకులు బురుగు రామస్వామి గౌడ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణం నిర్వహించడం జరిగిందని ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు విచ్చేసిన భక్తుల సౌకర్యార్థం అన్నప్రసాద ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వహకులు బూరుగు రామస్వామి గౌడ్ సుభద్ర దంపతులతో పాటు ఎలిశెట్టి భూమారెడ్డి ముత్యాల గంగాధర్ భూమయ్య చౌటుకూరి అంజయ్య గౌడ్ వెంకటేశ్వర్ రావు కళ్ళు శ్రీనివాస్ నాగరాజు కోటగిరి మహేష్ పురుషోత్తం ఆలయ ప్రధాన అర్చకులు ఇందుర్తి మధుసూదనా చారి ఫణీంద్ర శర్మ భక్తులు మహిళలు యువకులు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు



