రాయికల్
ఆటల్లో ప్రతిభను వెలికితీయటానికె అండర్ 14 క్రికెట్

viswatelangana.com
April 26th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
విజేత స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భూపతిపూర్ ప్రీమియర్ లీగ్ అండర్ 14 సీజన్ 1 క్రికెట్ పోటీలు ప్రారంభించిన స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు సోమ రమేష్ రెడ్డి, భూపతిపూర్ సీనియర్ క్రీడాకారుడు మంగళారపు ఆనంద్. వీరు మాట్లాడుతూ ముందు తరం ప్రవర్తన మీదే వెనుకతరం ఆదారపడి ఉంటుందని ఆటైనా పాటైనా ఇంకా ఏదైనా కానీ పెద్దల నడవడికని పిల్లలు అవలంబిస్తారని తెలిపారు. భూపతిపూర్ గ్రామంలో ఎందరో క్రీడాకారులు జిల్లా రాష్ట్ర స్థాయిలో ప్రతిభని కనపరిచారని వారిని ఆదర్శంగా తీసుకుని భూపతిపూర్ పేరుని రాష్ట్ర దేశ స్థాయిలో నిలపాని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, వ్యాయామ ఉపాధ్యాయులు ప్రతాప్ దేవేందర్ రవిష్ యూత్ సభ్యులు గ్రామ యువకులు క్రీడాకారులు పాల్గొన్నారు.



