కొడిమ్యాల
ఆర్ బి ఎస్ కే కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు కంటి పరీక్షలు

viswatelangana.com
February 22nd, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ హైస్కూల్, మోడల్ స్కూల్ జూనియర్ కళాశాల విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు జగిత్యాల ప్రభుత్వ దవాఖానాలోనిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మహేష్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులకు ఆర్ బి ఎస్ కే కార్యక్రమంలో భాగంగా ఉచితంగా కంటి పరీక్షలుచేస్తుందని, అవసరమైన విద్యార్థులకు కంటి అద్దాలు మందులు ఉచితంగా అందచేస్తుందని ప్రభుత్వం అందించే ఉచిత కంటి పరీక్షలు వైద్యాన్ని విద్యార్థులు తప్పకుండా వినియోగించుకోవాలన్నారు. 20 మందివిద్యార్థినీ, విద్యార్థులను పాఠశాలనుండి జిల్లా ప్రధాన దవాఖానకు ఆర్ బి ఎస్ కే వాహనం లో తీసికెళ్ళి తిరిగి తీసుకురావడం జరిగింది. కార్యక్రమంలోడాక్టర్ మహేష్, ఫార్మశిస్ట్ ప్రియ, ఏఎన్ఎంసరిత, ఉపాద్యాయులు సత్యానంద్ విద్యార్థులు పాల్గొన్నారు.



