కోరుట్ల
ఆర్టీసీ ప్రయాణం సురక్షితం – సుఖవంతం

viswatelangana.com
May 9th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
ఆర్టీసీ బస్స్ లో ప్రయాణికులకు ప్రయాణం సురక్షితం – సుఖవంతం అని కోరుట్ల డిపో మేనేజర్ మనోహర్ విలేకర్లతో మాట్లాడుతూ మాట్లాడుతూ.. ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలు ఆశ్రయించద్దని ఆర్టీసీ బస్ లోనే ప్రయాణం సురక్షితం అని, ఈ మధ్యకాలంలో గత కొన్ని రోజులుగా ప్రైవెట్ వాహనా యజమానులు వారి వాట్సప్ గ్రూపులలో ఏయిర్పోర్ట్ నుండి బస్ లు ఖాళీగా వెళుతున్నాయని వెళ్లేవారు ఉంటే కాల్ చేయండి అని మెసేజ్ లు వస్తున్నాయి. కావున మెసేజ్ లను చూసి కాల్ చేసి ఆ వెహికల్ లో వెళ్ళిపోతున్నారు అని తెలిపారు. ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేసి సురక్షితమైన సుఖవంతమైన ప్రయాణాన్ని పొంది ప్రయాణికులు ఆర్టీసీ ని ఆదరిస్తే మరిన్ని బస్సులు పెరిగే అవకాశం ఉందాని తెలిపారు.



