జగిత్యాల

ఆర్డీవో కు వినతి పత్రం అందజేసిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్

viswatelangana.com

May 16th, 2024
జగిత్యాల (విశ్వతెలంగాణ) :

కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆర్డిఓ కార్యాలయం వద్ద రైతు ధర్నా కార్యక్రమం చేపట్టి ఆర్డిఓ కి వినతిపత్రం అందజేసిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేష్ లు. వారు మాట్లాడుతూ ఆరు గ్యారెంటీలలో ఇచ్చిన ఇంకో హామీకి మంగళం కాంగ్రెస్ ప్రభుత్వం పాడిందని, క్వింటాలు వరి ధాన్యానికి 500 రూపాయల బోనస్ చెల్లిస్తామని ప్రకటించి. ఇప్పుడు కేవలం సన్న వడ్లుకు మాత్రమే బోనస్ ఇస్తామని రైతాంగాన్ని మోసం చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల, పార్టీ అద్యక్షులు, కార్యవర్గ సభ్యులు, ప్రజాప్రతినిధులు, రైతునాయకులు, రైతులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button