రాయికల్
ఆర్థిక సహాయం అందజేత

viswatelangana.com
March 26th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మూటపెల్లి గ్రామంలో ఇటీవల మరణించిన జైత నారాయణ కుటుంబాన్ని పరామర్శించి 30 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించిన దుబాయ్ ఎల్లాల శీనన్న సేవా సమితి సభ్యులు. గత 32 సంవత్సరాలుగా దుబాయ్ లో ఉంటూ ఇక్కడి తెలంగాణ వారికి విశేష సేవలు అందించిన జైత నారాయణ మృతి చాలా బాధాకరమని డాక్టర్ ఎల్లాల శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎల్లాల శీనన్న సేవా సమితి సభ్యులు మరియు స్థానిక నాయకులు రాజేందర్ రెడ్డి మండ రమేష్ సంగం రమేష్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.



