రాయికల్
ఆశా డే సందర్భంగా

viswatelangana.com
February 4th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా మహిళా సాధికారత బృందం ఆశ డే సందర్భంగా జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లిపూర్ పీహెచ్ సి లో మెడికల్ ఆఫీసర్ మాట్లాడుతూ పీసీ,పిఎన్ డి టి మరియు మెడికల్ టర్మినేషన్ ఆప్ ప్రెగ్నెన్సీ యాక్ట్ గురించి వివరించడం జరిగింది. బేటి బచావో బేటి పడావోలో భాగంగా మిషన్ శక్తి స్కీమ్, మహిళా సాధికారత, మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వారు అందించే సేవలు, సఖి, చైల్డ్ హెల్ప్ లైన్, లింగ నిర్ధారణ నిషేధ చట్టం, మరియు ఆడపిల్లల యొక్క ప్రాముఖ్యత గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసరు డాక్టర్ సమిన తబస్సమ్, మహిళా సాధికారత కేంద్రం టీమ్ బి.స్వప్న, కే.గౌతమి జెండర్ స్పెషలిస్ట్, తదితరులు పాల్గొనడం జరిగింది.



