ఇందిరమ్మ ఇళ్ల భూమి పూజలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు

viswatelangana.com
కోరుట్ల మండలం జోగన్ పల్లి గ్రామంలో సోమవారం రోజున ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు పాల్గొన్నారు. లబ్ధిదారురాలు తోకల లావణ్య మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయిస్తామని మాయమాటలు చెప్పి మోసం చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇల్లు కేటాయించి నేడు భూమి పూజకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కృష్ణారావు రావడం చాలా సంతోషమని అన్నారు.. ఇచ్చిన మాట ప్రకారం తమకు ఇల్లు కేటాయించిన కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జ్ జువ్వాడి నర్సింగరావు, జువ్వాడి కృష్ణారావు లకు కృతజ్ఞత తెలిపారు. అనంతరం జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాలకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించడం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజల కలల్ని సాకారం చేసే విధంగా ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పన్నాల అంజిరెడ్డి, కోరుట్ల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు ఎలేటి మహిపాల్ రెడ్డి, కోరుట్ల మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇంద్రాల హరీష్, గ్రామ శాఖ అధ్యక్షులు బిట్కు సహదేవ్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు సైదు గంగాధర్, పోతవేని లక్ష్మీ, దులూరి గంగరాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



