రాయికల్
ఇది గ్రీన్ గార్డెన్ కాదు, మురికి గుంత

viswatelangana.com
June 20th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లిపూర్ గ్రామ శివారులో పూర్తిగా గ్రీనరీ గా కనిపిస్తున్న మురికి గుంత దూరం నుండి చూస్తే ఆహ్లాదకరమైన పచ్చని ఆకృతితో ఉన్న గార్డెన్ కనిపిస్తుంది వాహన చోదకులు ఇది పచ్చని గడ్డి తో ఉన్న ప్రదేశం అని భ్రమపడి వెళ్తే వాహన ప్రమాదాలకు గురవుతున్నారు రోడ్లకు ఇరువైపులా వాహనలు వెళ్లేందుకు సమాంతరమైన మట్టిని పోసి రాకపోకలకు ఇబ్బందులు కలగ కుండ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత సంబంధిత రవాణా శాఖ అధికారులపై, గ్రామపంచాయతీ సిబ్బందిపై ఉంటుంది కానీ వారు నిర్లక్ష్యం వహించడంతో ప్రమాదాలకు నేలువుగా మారింది తక్షణమే అధికారులు స్పందించి ఈ మురికి గుంత ను పూడ్చి వేసే రాకపోకలకు ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు



