కొడిమ్యాల
ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజ

viswatelangana.com
June 8th, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని తిప్పాయపల్లె గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులుకు భూమి పూజ చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ ఇల్లు లేని నిరుపేదలైన తమను గుర్తించి ఇళ్ళు నిర్మించి ఇస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రెటరీ బుచ్చయ్య, మాజీ సర్పంచ్ మ్యాకల లత్ మల్లేశం, మాజీ వార్డు సభ్యులు దారం రత్నాకర్ రెడ్డి. అబ్రహం. గట్ల మల్లారెడ్డి. గ్రామ శాఖ అధ్యక్షులు కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు.



