కథలాపూర్
ఊట్ పల్లి గ్రామంలో బతుకమ్మ వేడుకలు

viswatelangana.com
October 14th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం ఊట్ పల్లి గ్రామంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టే బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. చివరి రోజు సద్దుల బతుకమ్మ సందర్భంగా మహిళలు, యువతులు అంతా ఒక్కచోట చేరి ఆడిపాడుతూ సంబరాలు చేసుకున్నారు. మహిళలంతా తీరొక్క పువ్వులతో అత్యంత భక్తి శ్రద్ధలతో బతుకమ్మను పేర్చారు. బతుకమ్మ సంబురాలతో పాఠశాల పరిసరాలు కాంతులీనాయి.



