ఎమ్మార్పీఎస్ జిల్లా స్తాయి సమీక్ష సమావేశం
ఎమ్మార్పీఎస్ 31 ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి.

viswatelangana.com
జగిత్యాల జిల్లా కేంద్రంలోకి మాదిగ సంఘం భవనంలో దీనికోసం ఎమ్మార్పీఎస్ జిల్లా స్థాయి సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారుముఖ్య అతిథిగా ఎమ్మార్పీఎస్ జగిత్యాల జిల్లా ఇన్చార్జి, రాష్ట్ర కార్యదర్శి జిల్లెల్ల మురళి మాదిగ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు జగిత్యాల జిల్లా ఇన్చార్జి చెన్నూరి శ్రీనివాస్ మాదిగ హాజరై మాట్లాడుతూ సామాజిక ఆర్థిక రాజకీయ అసమానతల లేని నూతన సమాజ నిర్మాణం కాంక్షిస్తూ ఎమ్మార్పీఎస్ ఉద్యమం తన ప్రయాణాన్ని కొనసాగిస్తుందని అన్నారు.మాదిగ సమాజానికి దక్కవలిసిన రిజర్వేషన్ హక్కుల కోసం పోరాడుతూనే మరోవైపు నిరాదరణకు గురైన వర్గాలైన వికలాంగుల వృద్దులు వితంతువుల కోసం పోరాడి వారికి పెన్షన్లు సాధించడం జరిగింది. గుండె జబ్బుల చిన్నారులకు ఉచిత ఆపరేషన్లు, ఆరోగ్యశ్రీ పథకం, ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు, తెలంగాణ అమరుల కుటుంబాలకు ఉద్యోగాలు, మహిళ భద్రత కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, తెల్ల రేషన్ కార్డు ప్రజలకు 6 కిలోల బియ్యం పెంపు మొదలగు ఫలితాలను ఎమ్మార్పీఎస్ సాధించిందని అన్నారు. ఈ ఫలాలు కేవలం మాదిగల కోసం చేసినవి కావని, అన్ని వర్గాల సంక్షేమం సామాజిక బాధ్యతతో చేసిన ఉద్యమలని అని అన్నారు. కాబట్టి సమాజ హితమే ధ్యేయంగా ఎమ్మార్పీఎస్ పోరాడుతుందని అన్ని వర్గాల ప్రజలు గుర్తించాలని అన్నారు.మాదిగల కోసం ముప్పై ఏళ్లుగా జరిగిన రాజీలేని పోరాటం విజయవంతమై ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలో ఎస్సీ వర్గీకరణ అమలు జరుగుతుందని అన్నారు. ఈ విజయానికి కారణం ఎమ్మార్పీఎస్ ఉద్యమానికి అన్ని వర్గాల ప్రజలు అందించిన సహకారమే అని అన్నారు. దేశంలో ఎన్నో కుల ఉద్యమాలు పుట్టినప్పటికీ లక్ష్యం సాధించే వరకు ఏ ఉద్యమం నిలబడలేకపోయాయి కాని ఎమ్మార్పీఎస్ మాత్రమే సజీవంగా నిలబడి లక్ష్యం చేరిందని దానికి సమాజం ఇచ్చిన సహకారమే ప్రధాన కారణమని అన్నారు. కనుక సమాజానికి కృతజ్ఞతగా భవిష్యత్ ఉద్యమ కార్యాచణతో ముందుకు సాగుతామని అన్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మార్పీఎస్ 31 ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు దుమాల గంగారం మాదిగ ఎమ్మార్పీఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు సురుగు శ్రీనివాస్ మాదిగ ఎమ్మెస్పి జిల్లా అధికార ప్రతినిధి బెజ్జంకి సతీష్ మాదిగ జిల్లా ఉపాధ్యక్షులు బోనగిరి కిషన్ ధర్మపురిమహిళ విభాగం రాష్ట్ర నాయకురాలు జిల్లా ఉపాధ్యక్షులు ముల్కల శ్రీనివాస్ శనిగరపు కాంతక్క జిల్లా కార్యదర్శి సంగేపు ముత్తు కళాకారుల జిల్లా అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు మారంపల్లి శ్రీధర్,ధర్మపురి నియోజకవర్గ ఇంచార్జ్ చిర్ర లక్ష్మణ్ మాదిగ జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జి బొల్లరపు దివాకర్ కో ఇంచార్జి పొడేటి సునీల్ ధర్మపురి సీనియర్ నాయకులు దీకొండ మహేందర్,నక్క సతీష్, బొల్లి అనిల్ మల్యాల మండల అధ్యక్షులు నలువల సంజీవ్ రాయికల్ మండల అధ్యక్షులు ధోబ్బల వేణు, బీర్పూర్ మండల అధ్యక్షులు తిరుపతి, ఉమ్మడి మండల అధ్యక్షులు చెన్న కుమార స్వామి, అర్బన మండల గౌరవ అధ్యక్షులు బిరుదుల గంగారాం, ఉపాధ్యక్షులు బలే నర్సయ్య, రూరల్ మండల ప్రధాన కార్యదర్శి నలువల లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు



