ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కు నిరసన గా ధర్నా

viswatelangana.com
రాయికల్ పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద తెరాస శ్రేణులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ కు నిరసనగా నల్ల జెండాలతో ధర్నా చేశారు రోడ్డుపై బైఠాయించగా అరగంట సేపు రాకపోకలు ఆగిపోయాయి కేంద్ర ప్రభుత్వం నిరకుత్వంతో కేసీఆర్ కుటుంబంపై కక్ష్యా కట్టి ఎమ్మెల్సీ కవితను అకారణంగా అరెస్ట్ చెయ్యడం సరికాదని మోడీ తీరు సరికాదని అన్నారు,అన్యాయంగా ఆడబిడ్డను శుక్రవారం పూట అరెస్ట్ చెయ్యడం మోడీ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు నిదర్శనమని తక్షణం అరెస్ట్ వెనక్కు తీసుకోవాలని బేషరతుగా విడుదల చెయ్యాలని డిమాండ్ చేసారు ఇలాగె కక్ష్యపూరిత చర్యలకు పూనుకుంటే బిజెపి నాయకులను ఊళ్లలో తిరుగనీయం అని అన్నారు అంబులెన్స్ కు దారి ధర్నా కార్యక్రమంలో అంబులెన్స్ రెండు సార్లు రాగ అంబులెన్స్ కు ధర్నా నుండి లేచి మరి అంబులెన్స్ కు దారి ఇచ్చి మానవత్వం చాటుకున్నారు ధర్నా ఉదృతంగా జరుగుతున్నప్పటికిని మానవత్వం చాటుతూ దారి ఇవ్వడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు పోలీసులు జోక్యంతో విరమణ దాదాపు అరగంట పైగా సాగిన దర్నావలన ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలిగింది లారీ లు, కారు లు, ఆటోలో రోడ్లపై నిలిచిపోయాయి పోలీసులు కలుగ చేసుకుని ధర్నా విరమించారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కోల శ్రీనివాస్, మండల పరిషత్ అధ్యక్షురాలు లావుడ్య సంధ్యారాణి , జెడ్పిటిసి అశ్విని జాదవ్ , పురపాలక సంఘం రాయికల్ చైర్మన్ మోర హన్మండ్లు , వైస్ చైర్మన్ గండ్ర రమాదేవి , కౌన్సిలర్ తురగ శ్రీధర్ , సాయి కన్నక మహేందర్, ఎంపిటిసి నాగరాజ్ , మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఉదయశ్రీ , చల్ల సురేష్ , శ్రీరాముల సత్యనారాయణ , సురేందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు



