కోరుట్ల
ఎస్.ఎస్.కే. (ఖత్రి) సమాజ్ అధ్యక్ష, కార్యదర్శులుగా ధోండి నందలాల్, శికారి గోపికృష్ణ ఏకగ్రీవంగా ఎన్నిక

viswatelangana.com
June 24th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల పట్టణ సోమవంశ సహసర్జన క్షత్రియ (ఎస్.ఎస్.కే.) సమాజ్ ఎన్నికలు మంగళవారం పట్టణంలోని గాంధీ రోడ్ లో గల ఎస్.ఎస్.కే. భవన్‌లో నిర్వహించబడాయి. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి పదవులకు పోటీదారులెవరూ లేకపోవడం వల్ల ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి.ఈ సందర్భంగా ధోండి నందలాల్ అధ్యక్షుడిగా, శికారి గోపి కృష్ణ ప్రధాన కార్యదర్శిగా, జమామ్ జ్యోతి రాజేంద్ర ప్రసాద్ కోశాధికారిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన పదాధికారులకు మాజీ అధ్యక్షుడు గంటేడి ప్రభాకర్, శికారి విజయ్, గంటేడి శ్రీనివాస్, జమామ్ జ్యోతి శ్రీనివాస్, బచ్చవాల సంజీవ్, బాదం పురుషోత్తం, చావ్ల లక్ష్మి నారాయణ, బచ్చల కిషన్, గంగామోహన్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.



