రాయికల్
ఎస్ జి ఎఫ్ జిల్లాస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మోడల్ స్కూల్ విద్యార్థులు

viswatelangana.com
October 26th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లాస్థాయి ఎస్ జి ఎఫ్ క్రీడా పోటీల్లో అండర్ 17 బాలుర విభాగం హై జంప్ మరియు కబడ్డీలో కె.శ్రీ వర్ధన్, అండర్ 14 బాలుర విభాగం కబడ్డీలో జి.చిన్న బాబు, అండర్ 14 బాలికల విభాగం వాలీబాల్ లో డి.భార్గవి, ఉత్తమ ప్రతిభ కనబరిచినందున వీరిని ప్రిన్సిపల్ కే.సంతోష్ కుమార్ మరియు ఉపాధ్యాయ బృందం అభినందించారు. ఈ విద్యార్థులు ఉమ్మడి కరీంనగర్ జోన్ స్థాయి పోటీల్లో పాల్గొంటారని వ్యాయామ ఉపాధ్యాయుడు వి కిషోర్ కుమార్ తెలిపారు.



