ఎస్జిటి ఎస్టీ విభాగంలో జిల్లా మొదటి ర్యాంకు సాధించిన తుర్తి వాసి

viswatelangana.com
తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 30 న (సోమవారం రోజున) ప్రకటించిన డీఎస్సీ ఫలితాలలో కథలాపూర్ మండలంలోని తుర్తి గ్రామానికి చెందిన లావుడ్య స్వామి – పద్మ అనే తల్లిదండ్రుల ప్రోత్సాహంతో కుమారుడు లావుడ్య నగేష్ పట్టుదలతో చిన్ననాటి నుంచి విద్యాభ్యాసం తుర్తి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు చదివి 6 నుండి 10వ తరగతి వరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అంబారిపేటలో చదివి ఇంటర్ కథలాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంచి మార్కులతో ఇంటర్ సెకండ్ ఇయర్ పూర్తిచేసి కోరుట్ల రష్మీధర్ తేజలో డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ కళాశాలలో డిఈడి పూర్తి చేసి డీఎస్సీ లో మొట్ట మొదటిసారిగా ఉద్యోగం సాధించారు ఎస్జీటీ విభాగంలో జిల్లా 40వ ర్యాంకు, ఎస్టీ విభాగంలో జిల్లా మొదటి ర్యాంకు సాధించి ఉద్యోగ అర్హత సాధించారు. తల్లిదండ్రులు గ్రామ ప్రజలు మరియు మండల ప్రజలు చిన్ననాటి స్నేహితులు ప్రత్యేక అభినందనలు తెలిపారు.



