మేడిపల్లి
ఎస్సై చాకచక్యంగా సెల్ ఫోన్స్ పట్టుకొని బాధితులకు అప్పగింత

viswatelangana.com
April 8th, 2024
మేడిపల్లి (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలోని కొండాపూర్ గ్రామానికి చెందిన నాంపెల్లి రమణయ్య, కట్లకుంట గ్రామానికి చెందిన యేలేటి రాజశేఖర్ రెడ్డిల ఫోన్లు పోయినవి అని మేడిపల్లి స్థానిక పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయగా, మేడిపల్లి పోలీసులు వెంటనే స్పందించి అట్టి ఫోన్లను ట్రాక్ చేసి పట్టుకొని సోమవారం రోజు పిటిషన్ దారులకు ఎస్ ఐ శ్యామ్ రాజ్ అందించారు. ఈ సందర్భంగా ఎస్ ఐ శ్యామ్ రాజుకు నాంపల్లి రమణయ్య, యేలేటి రాజశేఖర్ రెడ్డిలు కృతజ్ఞతలు తెలిపారు.




