కోరుట్ల
ఓటు హక్కు వినియోగించుకున్న 108 సంవత్సరాల వృద్ధురాలు

viswatelangana.com
May 13th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం కల్లూరు గ్రామపంచాయతీ పోలింగ్ బూత్ నెంబర్ 111 లో హోటల్ గంగమ్మ అనే 108 సంవత్సరాల వృద్ధురాలు తన యొక్క ఓటును వినియోగించుకున్నారని గ్రామ మాజీ సర్పంచ్ వన తడుపుల అంజయ్య తెలియజేశారు. ఆమెకు ఎనిమిది మంది సంతానంలో మనవలు మనవరాలు చాలా పెద్ద ఉమ్మడి కుటుంబం అని తన పెద్ద కూతురికి 80 సంవత్సరాలు పైబడిన వయస్సు ఉందన్నారు.



