
viswatelangana.com
October 26th, 2024
జగిత్యాల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రి లో జరిగిన విషయాన్ని ఫిర్యాదు చేయటానికి పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించిన ఓ పౌరున్ని పరుష పదజాలంతో ఇష్టమొచ్చినట్లు బూతులు తిడుతూ ఓ పోలీస్ అధికారి ఆ వ్యక్తి ఫోను లాక్కోవడానికి ప్రయత్నం చేయగా, బాధితుడు నేను ఎలాంటి క్రైమ్ చేయలేదు అని వాదించగా అక్కడే ఉన్న ఓ పోలీసు అధికారి ఈ ******** ను లోపట వేయండి అంటూ బూతులు తిడుతూ, అక్కడే ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందితో ఆ ******* చేతిలో నుండి ఫోన్ ను దౌర్జన్యంగా లాక్కోండి అని, అనధికారికంగా ఆజ్ఞాపించడంపై బాధితుడు ఆవేదనతో ఎవరైనా తిడితే పోలీసులను ఆశ్రయిస్తారు…. కానీ పోలీసులే దురుసుగా ప్రవర్తించి తిడితే ఎవరిని ఆశ్రయించాలి ..? అని వాపోయాడు.



