కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి తహాసిల్దార్ ఖయ్యూం

viswatelangana.com
రాయికల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కరీంనగర్ రేకుర్తి కంటి హాస్పిటల్ వైద్యులచే పట్టణంలోని బాలుర పాఠశాలలో చేపట్టిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని తహసిల్దార్ ఖయ్యూం ప్రారంభించారు.ఈ శిబిరంలో 265 మందికి కంటి పరీక్షలు చేయగా 84 మందికి కంటి ఆపరేషన్ కోసం గుర్తించి 44 మందిని ఆపరేషన్ కోసం హాస్పిటల్ కు వైద్యులతో సహా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా తాసిల్దార్ మాట్లాడుతూ… రాయికల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. భవిష్యత్తులో నిరుపేదల కోసం మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. లయన్స్ క్లబ్ సుమారు 1913 మందికి కంటి ఆపరేషన్లతో పాటుగా మరెన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు మచ్చ శేఖర్, వైద్యులు డాక్టర్ ఉదయ్ కుమార్, సబీర్ మహమ్మద్, ప్రభాకర్, లయన్స్ క్లబ్ మాజీ డిసీలు మ్యాకల రమేష్, బత్తిని భూమయ్య, కాటి పెల్లి రాంరెడ్డి, ప్రధాన కార్యదర్శి కడకుంట్ల నరేష్, కోశాధికారి కట్ల నర్సయ్య, ఉపాధ్యక్షులు కుర్మా సుదర్శన్ రెడ్డి, కనపర్తి శ్రీనివాస్, లయన్స్ క్లబ్ సభ్యులు ఎద్దండి దివాకర్, దాసరి గంగాధర్, బొమ్మ కంటి నవీన్, గంట్యాల ప్రవీణ్, సాంబారు శ్రీనివాస్, ల్యాబ్ టెక్నీషియన్ మోసారపు సంతోష్, గ్రామీణ వైద్యులు ప్రవీణ్, ఉప్పుల నవ్య, యువకులు బాపురపు రాజీవ్, మారంపల్లి రాంకి తదితరులు పాల్గొన్నారు.



