కథలాపూర్
కథనానికి స్పందించిన అధికారులు

viswatelangana.com
April 22nd, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
విశ్వ తెలంగాణ పత్రిక లో మిషన్ భగీరథ నీళ్లు రావడం చూసి ఆందోళన చెందుతున్న గ్రామ ప్రజలు అనే కథనం సోమవారం రోజున ప్రచురితమైంది. వివరాల్లోకి వెళ్తే కథలాపూర్ మండలం ఊట్ పల్లి గ్రామంలో మిషన్ భగీరథ పైపు లీకేజి అయ్యి విద్యుత్ స్థంభం దగ్గర నీళ్లు వస్తుండగా ఈ కథనం విశ్వ తెలంగాణలో ప్రచురితమైంది. ప్రచురితమైన కొన్ని గంటల వ్యవధిలోనే గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆనంద్ సమస్య పరిష్కారం దిశగా చర్యలు చేపట్టారు. ఆయన మాట్లాడుతూ ఇక ముందు ఇలా జరగకుండా చూస్తామని చెప్పడం జరిగింది.



