కథలపూర్ మండల పరిధిలో పలు అభివృద్ధి పనులకు ప్రత్యేక అభివృద్ధి నిధులు(SDF) మంజూరు

viswatelangana.com
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గనికి వివిధ అభివృద్ధి పనులకు కోసం 10 కోట్ల నిధులను మంజూరు చేయగా,ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంఛార్జ్ మంత్రివర్యులు ఉత్తం కుమార్ రెడ్డి చొరవతో ప్రభుత్వ విప్,వేములవాడ శాసన సభ్యులు ఆది శ్రీనివాస్ ప్రత్యేక అభివృద్ధి నిధుల(SDF) నుండి కథలపూర్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనుల్లో భాగంగా కుల సంఘ భవనలకు,మహిళా సమైక్య భవనాలకు, పాఠశాలల్లో అభివృద్ధి పనులకు, ప్రజలకు త్రాగునీరు సౌకర్యార్థం నూతన బోరు బావులకు,మోటార్లకు గ్రామాల్లోని ఇతర అభివృద్ధి పనుల నిమిత్తం 1 కోటి 40 లక్షల 50 వేల రూపాయలు నిధులు మంజూరి అయ్యాయని తెలిపారు కథలపూర్ మండల పరిధిలో నిధుల విడుదలకు చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు మండల ప్రజలు, కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు..



