కథలాపూర్
కథలాపూర్ కి నూతనంగా వచ్చిన ఎస్సై నవీన్ కుమార్ కి సన్మానం

viswatelangana.com
February 17th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కథలాపూర్ పోలీస్ స్టేషన్ కు ఎస్సై నవీన్ కుమార్ బదిలీపై వచ్చిన సందర్భంగా ప్రెస్ క్లబ్ కథలాపూర్ సభ్యులు చిరు సన్మానం చేశారు. ఈ సందర్భంగా క్లబ్ సభ్యులు మాట్లాడుతూ శాంతి భద్రతలను కాపాడడంలో తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమం లో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దర్శనాల లతీష్, ప్రధాన కార్యదర్శి కొండా నవీన్, సభ్యులు తొగరి రాజేంధర్, రాధారపు నరేష్ తదితరులు పాల్గొన్నారు.



