రాయికల్

కమనీయం.. సీతారాముల కల్యాణం  ..పల్లకి సేవలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి

viswatelangana.com

April 6th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :

ముత్యాల పందిళ్ళు… మంగళ వాయిద్యాలు.. వధూవరుల ఎదుర్కొల్లు… ముత్యాల తలంబ్రాలు.. పట్టు వస్రాలు, పుస్తేలు, మట్టేలు సమర్పించి…   వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య రఘువంశ రామయ్య… సుగుణాల సీతమ్మ కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఆదివారం రాయికల్ పట్టణంలోని ఆంజనేయ స్వామి ఆలయం, మండలంలోని అయోధ్య, తాట్లవాయి,  బోర్నపెల్లి, ఇటిక్యాల్, భూపతిపూర్, రామాజీపేట, గ్రామరామాలయంలో వేద పండితుల మంత్రోత్సవాలు, మంగళ వాయిద్యాల మధ్య సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం సీతా రాముల ఉత్సవ మూర్తులను గ్రామాల పురవీధుల్లో ఊరేగించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. డిప్యూటీ తహశీల్దార్ గణేష్ దంపతులు ప్రభుత్వం తరపున శ్రీ కోదండ సీత – రామచంద్ర స్వామీ వారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్రాలు, పూస్తేలు, మట్టేలు సమర్పించారు. రాయికల్ పట్టణంలోని హనుమాన్ ఆలయంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఉత్సవమూర్తుల పల్లకిని భుజాలపై మోసి ఊరేగింపుగా తరలివచ్చారు. మాజీ జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత కల్యాణ మహోత్సవానికి హాజరై ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఆలయాల్లో జరిగిన సీతారామ కల్యాణ మహోత్సవాన్ని గ్రామ ప్రజలు భక్తులు వీక్షించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ ఆలయ చైర్మన్ దాసరి గంగాధర్,కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు మ్యాకల రమేష్,బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు గోపి రాజిరెడ్డి, మాజీ కౌన్సిలర్ మ్యాకల అనురాధ, మండల యూత్ అధ్యక్షులు ఏలేటి జలంధర్ రెడ్డి, యూత్ పట్టణ అధ్యక్షులు బత్తిని నాగరాజు, మాజీ సర్పంచ్ ఎద్దండి భూమ రెడ్డి, నాయకులు కొయ్యేడి మహిపాల్, బాపురపు నర్సయ్య, బత్తిని భూమయ్య, ఏద్దండి దివాకర్, పొన్నం శ్రీకాంత్,భూమా గౌడ్,కోల రవి,వాసం దిలీప్, ఆనందం, గోపాల్, కడకుంట్ల నరేష్,రాకేష్ నాయక్, రాజేష్, అశోక్, రాజీవ్, జక్కుల రవి,రవి,కట్ల నర్సయ్య, నాయకులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button