కరీంనగర్ కాంగ్రెస్ ఎంపి అభ్యర్థి రాజేందర్రావు కు… సిపిఐ పూర్తి మద్దతు

viswatelangana.com
కథలాపూర్ మండల కేంద్రంలో ని కథలాపూర్ లో సిపిఐ జగిత్యాల జిల్లా సమితి కార్యదర్శి వెన్న సురేష్ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇండియా కూటమి బలపరుస్తున్న కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ భారత కమ్యూనిస్టు పార్టీ పార్టీ శ్రేణులు అలాగే ప్రజాసంఘాల సభ్యులు కార్మికులు. రైతులు. శ్రమజీవులు ముఖ్యంగా జిల్లాలో ఉన్న బీడీ కార్మికులు, వలస కార్మికులు, చిన్న, సన్నకారు రైతులు కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకు ఓటు వేసి గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోడీ పాలనలో బీడీ కార్మికులకు, రైతులకు, గల్ఫ్ వలస కూలీలకు ఎలాంటి ప్రయోజనాలు జరిగాయో కరీంనగర్ బిజెపి అభ్యర్థి బండి సంజయ్ చెప్పాగలరా కరీంనగర్ నియోజకవర్గం ప్రజలకు బిజెపి ఏం చేసిందని ఓట్లు వేయాలో బండి సంజయ్ చెప్పాలని అయోధ్యలో రామ మందిరం నిర్మాణం తొ భారత జాతి ఆర్థిక పరిస్థితి మెరుగుపరుస్తుందా అని అడిగారు. విడాకులు తీసుకోకుండా భార్యని విడిచి పెట్టిన మోడీ తన లాగానే ఆదర్శ పురుషుడైన రాముని జీవితాన్ని కూడా చేయాలని ఉద్దేశంతోనే సీతమాత లేని రాముని అయోధ్యలో ప్రతిష్టించి భార్యాభర్తలు అయినా సీతారాములను విడదీసినందుకు బిజెపికి ఓటు వేయాలా బండి సంజయ్ అని నిలదీశారు. రోజువారి జీవితంలో పేదలు నిత్యవసర వస్తువులు కొనలేక వారి జీవన ప్రమాణాలు తగ్గాయని అన్ని రిపోర్ట్ చెప్తుంటే తమ పిల్లలకు నాణ్యమైన విద్య ,వైద్యం అందించలేక అవస్థలు పడుతుంటే రామనామం జపం చేసి పేద ప్రజల విశ్వాసంతో ఆడుకుంటారా అని నిలదీశారు. బిజెపి పార్టీ పేదల పార్టీ అనే చెప్పే దమ్ముందా మీ పార్టీ కాన్స్టిట్యూషన్ ప్రజల ముందు చదివి వినిపించి ఓటు అడిగే దమ్ముందా బండి సంజయ్ నీకు అని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఐ నాయకులు చెన్నవేని దశరథం, సోమ భూముయ్య, ముత్యాల మురళి, కర్నె భూమయ్య, కుమ్మరి ఇస్తారు, కొమురోజీ శేఖర్, రాజేశ్వర్ రెడ్డి, సాకాలి రాజం, కొండూరి రాజేష్, బొర్రన్న పాల్గొన్నారు.



