కథలాపూర్
కరీంనగర్ పార్లమెంట్ ఇంచార్జి గా రాష్ట్ర ఫిషర్ మెన్ కార్యదర్శి కల్లెడ గంగాధర్ నియామకం

viswatelangana.com
April 25th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం కలికోట గ్రామానికి చెందిన రాష్ట్ర ఫిషర్ మెన్ కమిటీ కార్యదర్శి కల్లెడ గంగాధర్ ను కరీంనగర్ పార్లమెంట్ ఇంచార్జి గా నియమిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ ఫిషర్ మెన్ కమిటీ అధ్యక్షులు మెట్టు సాయికుమార్ నియామక పత్రం విడుదల చేశారు. నూతనంగా నియమితులైన కరీంనగర్ పార్లమెంట్ ఇంచార్జి కల్లెడ గంగాధర్ మాట్లాడుతూ తనను నమ్మి ఇంచార్జి బాధ్యతలు ఇచ్చిన రాష్ట్ర ఫిషర్ మెన్ కమిటీ అధ్యక్షులు మెట్టు సాయికుమార్ కి,బీసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కి, ఐటి మంత్రి శ్రీధర్ బాబుకి, ఎమ్మెల్యే లు ఆది శ్రీనివాస్, మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ లకు, సిరిసిల్ల ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి, హుజురాబాద్ ఇంచార్జి ప్రణవ్ బాబులకు కృతజ్ఞతలు తెలిపారు.



