కోరుట్ల

ప్రపంచ దేశాలకు భారత్ ఖ్యాతిని తెలిసేలా చేసింది మోదీ

viswatelangana.com

February 26th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

కరోనా మహమ్మరీ విలయ తాండం చేస్తున్న సమయంలో సుమారు వంద దేశాలకు వ్యాక్సిన్స్ పంపి భారత ఖ్యాతిని ప్రపంచ దేశాలకు తెలిసేలా చేసింది, భారతను విశ్వగురువుగా పరిచయం చేసింది ప్రధానమంత్రి మోదీయని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి అన్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న ప్రజా సంకల్ప యాత్ర సోమవారం కోరుట్లకు చేరుకోగా, స్థానిక బస్టాండ్ వద్ద స్ట్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి మాట్లాడుతూ మైనార్టీలకు షాదీముబారక్, మైనార్టీ పాఠశాలల్లో విద్యార్థులు చదువుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తుందని, మైనార్టీల సంక్షేమానికి కృషి చేస్తున్న మోదీని ముస్లింలు మరిచిపోవద్దన్నారు. తెలంగాణ ఉద్యమంలో 14 వందల మందిని పొట్టపెట్టుకున్న దొర కేసీఆర్ అయితే, దేశాన్ని విడగొట్టింది కాంగ్రెస్ కాదా అని దుయ్యబట్టారు. ఉత్తర తెలంగాణకు నిధులు కేటాయింపులో వివక్ష చూపితే సాహించేది లేదని, మరో ఉద్యమానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. భారతదేశ భవిష్యత్తు బాగుండాలంటే మరోసారి మోదీ ప్రభుత్వం రావాలని, కాశ్మీర్లోని 370 ఆర్టికల్ తీసివేసినపుడు కాంగ్రెస్, బీఆర్ఎస్ వాళ్లు దేశం అల్లకల్లోలం అవుతుందని కాంగ్రెస్ వాళ్లు ప్రజలకు కల్లబొల్లి మాటలు చెబుతూ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారన్నారు. వాళ్లు అనుకున్న విధంగా దేశంలో ఏం జరుగలేదని, 370 ఆర్టికల్ తెచ్చి కాశ్మీర్ను భారత్లో అంతర్భాంగా చేసినందుకు మోదీ ప్రభుత్వాన్ని గెలుపించాలన్నారు. దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నారని, దేశంలో మూడోసారి మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టబోతుందన్నారు.

  • రాముడు కావాలా.. రాహుల్ ఖాన్ కావాలో నిర్ణయించుకొండి : ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి

రాముడు కావాలా.. రాహుల్ ఖాన్ కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్రెడ్డి అన్నారు. బీజేపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టి విజయ సంకల్ప యాత్రలో భాగంగా పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందని, మోదీ ప్రజల కోసం రోజుకు 18 గంటలు పనిచేస్తూ భారతదేశాన్ని ప్రపంచ దేశాలు మెచ్చుకునే విధంగా చేశార న్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ మతాల మధ్య చిచ్చుపెడుతూ రాజకీయంగా పబ్బం గడుపు కుంటున్నారని ఎద్దేవా చేశారు. పరదేశీయుడు మన దేశానికి వచ్చి మన రామ మందిరాన్ని కూలగొట్టాలని ఆనాడు లక్ష డెబ్బై ఐదు వేల మంది రామమందిరం కొరకు తమ ప్రాణాలు పోగోట్టుకున్నారని, ఆ త్యాగధనుల ఫలితమే నేటి భవ్యమైన రామ మందిరం అన్నారు. ఈ కార్యక్ర మంలో జగిత్యాల నియోజకవర్గ బీజేపీ ఇంచార్జీ బోగ శ్రావణి, జిల్లా అధ్యక్షుడు మోరపల్లి సత్య నారాయణ, రాష్ట్ర నాయకులు సురభి నవీన్, పట్టణాధ్యక్షుడు బింగి వెంకటేష్, మండలాధ్య క్షుడు పంచిరి విజయ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మాడవేని నరేష్, నాయకులు తిరుమలవాను, రుద్ర శ్రీనివాస్, కస్తూరీ లక్ష్మీనారాయణ, పీసరి నర్సయ్య, సుదవేని మహేష్, చెట్లపల్లి సాగర్, మెట్పల్లి పట్టణ, మండలాధ్యక్షులు బొడ్ల రమేష్, కొమ్ముల రాజ్పాల్రెడ్డి, నాయకులు ఎలేటి నరేందర్రెడ్డి,మద్దెల లావణ్య, దొనికెల నవీన్, బోగ గంగాధర్, మంచాల శివకుమార్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button