కోరుట్ల
కల్లూరు పాఠశాలలో ముందస్తు బతుకమ్మ నిమజ్జన వేడుకలు

viswatelangana.com
October 1st, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల మండలంలోని కల్లూరు గ్రామ శివారులో ఉన్న మోడల్ స్కూల్ అలాగే కస్తూరిబా గాంధీ స్కూల్, ఉన్నత ప్రాథమిక పాఠశాలలోని బాలికలు ఉపాధ్యాయులు అందరూ కలిసి, దసరా సెలవులు రావడంతో ముందస్తుగా బతుకమ్మ నిమజ్జన కార్యక్రమాన్ని ముందుగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా బాలికలు సంప్రదాయ బద్ధంగా బతుకమ్మ పాటలు ఆడి, పాడి నిమజ్జనం చేసారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్, హెచ్ఎం, కల్లూరు గ్రామ తాజా మాజీ సర్పంచ్, వన తడుపుల అంజయ్య, అలాగే విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.



