రాయికల్
కూచిపూడి కళాకారీని అంజన శ్రీని సన్మానించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

viswatelangana.com
March 20th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
రాయికల్ మండలం రామాజీపేట్ గ్రామానికి చెందిన బొమ్మకంటి అంజన శ్రీ నాలుగు సంవత్సరాల వయసులో స్కూల్ బస్సు ప్రమాదంలో ఎడమకాలు కోల్పోగా కృత్రిమ కాలు ( ఆర్టిఫిషల్ లెగ్ ) తో కూచిపూడి నృత్యం నేర్చుకుంటూ జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిలో పలు ప్రదర్శనలు చేసి అవార్డులు అందుకుంది. బొమ్మ కంటి అంజనశ్రీకి మళ్లీ కృత్రిమ కాలు ( ఆర్టిఫిషల్ లెగ్ ) అవసరం ఉండగా బుధవారం రాయికల్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేసింది. వెంటనే స్పందించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి తో మాట్లాడి సీఎంను కల్పిస్తానని కృత్రిమ కాలు పెట్టించే విధంగా చూస్తానని మాట ఇచ్చారు. అనంతరం అంజన్న శ్రీని సన్మానించి మునుముందు చాలా ప్రదర్శనలు ఇస్తూ ముందుకు సాగాలని ఆశీర్వదించారు అలాగే ప్రభుత్వపరంగా ఆదుకుంటామని తెలిపారు.



