కోరుట్ల

కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో వసంత పంచమి వేడుకలు

viswatelangana.com

February 3rd, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

కోరుట్ల పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో సోమవారం వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇట్టి వేడుకల్లో భాగంగా సరస్వతి దేవికి ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించి పాఠశాలలో నూతనంగా ప్రవేశం తీసుకున్న విద్యార్థినీ విద్యార్థులకు వేద పండితుల ఆద్వర్యంలో అక్షరాభ్యాసం చేయించారు. అక్షర అభ్యాసంలో పాల్గొన్న విద్యార్థినీ విద్యార్థులకు నోటి పుస్తకాలు, పెన్నులు అలాగే పలకలు అందించారు. ఇట్టి కార్యక్రమంలో విద్యార్థుల తల్లి దండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు అలాగే సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

Back to top button