కొండాపూర్ గ్రామపంచాయతీ రికార్డ్స్ తనిఖీ చేసిన కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్

viswatelangana.com
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కొండాపూర్ గ్రామపంచాయతీ యొక్క రికార్డ్స్ మొత్తము కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ ( పౌర మానవ హక్కుల సంస్థ) ఆధ్వర్యంలో ఆర్టీఐ యాక్ట్ 2005 ప్రకారం తనిఖీలు నిర్వహించడం జరిగింది.ఈ తనిఖీలు ప్రొద్దున నుండి సాయంత్రం వరకు కొనసాగాయి స్టేట్ సెక్రటరీ చరణ్ కాంత్ మాట్లాడుతూ గ్రామపంచాయతీ యొక్క రికార్డ్స్ సరిగా లేవన్నారు. అలాగే ఫైనల్ రిపోర్ట్స్ తయారు చేసి రికార్డ్స్ సమయంలో లభించిన అవకతవకలు దొరికిన తప్పులు అన్ని ఫైనల్ రిపోర్ట్ తయారుచేసి జిల్లా కలెక్టర్ కి లేదా సంబంధిత పై అధికారులకు సబ్మిట్ చేయడం జరుగుతుందని ఆయన వివరించారు. సమాజంలో జరుగుతున్న అవినీతిని బయట పెడుతూ అలసత్వం లేని సమాజం నిర్మించడమే సిసిఆర్ లక్ష్యం అని తెలిపారు అలాగే సమాచార హక్కు చట్టంపై ప్రజలందరూ అవగాహన కలిగి వుండాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంస్థ ప్రెసిడెంట్ అనిల్,చరణ్ కాంత్, తాలూకా మల్లేష్, జహంగీర్, శివ, రత్నాకర్, గంగాధర్, కిషన్ జయప్రకాష్ ఇంకా సిసిఆర్ మెంబర్స్ పాల్గొన్నారు.



